The Actor Prakash Raj Finally Reacted To Pawans Win
Cinema

Prakash Raj: పవన్‌ కల్యాణ్‌పై సంచలన ట్వీట్‌ వైరల్

The Actor Prakash Raj Finally Reacted To Pawans Win: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ పార్టీపై అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.

దీంతో జనసేనానికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఎట్టకేలకు నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా అభినందనలు తెలిపారు. మీతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్‌ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో ఉన్నా మోడీలా కాకుండా సెక్యులర్ నాయకుల్లాగానే ఉంటారని నమ్ముతున్నాను అని అన్నారు.

జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన ఛాన్స్‌తో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?