Temple Unearthed In Nellore Is Intact Says Archaeology Official
Cinema

Viral News: కల్కి గుడి నెట్టింట వైరల్

Temple Unearthed In Nellore Is Intact Says Archaeology Official: పాన్‌ ఇండియా స్టార్‌ డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేసిన లేటెస్ట్‌ మూవీ కల్కి 2898. ఈ మూవీలో అశ్వథామ ఎంట్రీలో కనిపించే శివాలయం నెల్లూరు జిల్లా పెరుమాళ్లాపురం గ్రామం సమీపంలో పెన్నానది ఒడ్డున ఉంది. పెన్నానది వరదలకు ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆలయం రెండేళ్ల కిందట బయటపడింది.

కరోనా కాలంలో గ్రామస్థులు ఈ ఆలయం కోసం నది ఒడ్డున తవ్వకాలు జరపడంతో వెలుగులోకి వచ్చింది. దాదాపు 300 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ ఆలయానికి సంబంధించిన వివరాలతో ఓ యూట్యూబ్ ఛానల్ తీసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలో ఆలయ గోపురం మాత్రం బయటకు కనిపిస్తోంది. ఇసుకలో కూరుకుపోయిన ఆలయంలోకి వెళ్లేందుకు గ్రామస్థులు చిన్న మార్గం చేశారు.

Also Read: ‘ఫేస్’ తిప్పుకోనియ్యని అందం

లోపల కూరుకుపోయిన ఇసుకను తొలగించారు. లోపల శివలింగం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. లోపలి నుంచి చూస్తే ఆలయ గోపురం చాలా ఎత్తులో ఉంటుంది. బయట శిఖరం నాలుగు వైపులా నందులతో, ఇతర శిల్పాలతో ఉంది. ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో లోపల ఉన్న విగ్రహాలను ఇతర ఆలయాల్లోకి తరలించారని గ్రామస్థులు చెప్పారు.ఆలయంలో బయటపడ్డ శిల్పాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?