Tapsi Pannu
Cinema

Tapsi pannu: ఆ పోలికే కలిసొచ్చింది

Tapsi pannu telling about her bollywood entry compare with Preethi Zinta
బాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సొట్ట బుగ్గల సుందరి తన సినీ కెరీర్ మొదట తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది. మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన “ఝుమ్మంది నాదం” సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగు మరియు తమిళ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరవాత చేసిన సినిమాలు సరిగ్గా నడవకపోవడంతో సరైన అవకాశాలు రాక బాలీవుడ్ కి వెళ్ళింది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్ద పెద్ద స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

బాలీవుడ్ కి వెళ్ళడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. తన బాలీవుడ్‌లో తన ఎంట్రీకి నటి ప్రీతి జింటాకు సంబంధం ఉందని తాప్సీ పన్ను వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్లు వచ్చాయి. కొన్నాళ్లకే ఆమెకు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. నేను చూడడానికి కొంచెం ప్రీతీ జింటాలా ఉండడం వల్లే నాకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి, అందువల్లే నేను ఆమెలా ఉండడానికి ప్రయతించాను అని తెలిపింది. ఇటీవలే చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో ను మార్చిలో ఉదయపూర్‌లో తాప్సీ వివాహం చేసుకుంది. తాప్సీ చివరిగా షారూఖ్‌తో కలిసి డుంకీలో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనూ సినిమాలు చేయాలనుకుంటోంది.

 

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!