nirnayam movie
Cinema

త్వరలో తనికెళ్ల భరణి ‘నిర్ణయం’

Tanikella bharani new movie(Latest news in tollywood): ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి నటించిన సందేశాత్మక చిత్రం నిర్ణయం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తనికెళ్ల భరణి, ‘బాహుబలి’ హరిశ్చంద్ర రాయల రఘునాథ రెడ్డి, జనార్ధన్ రావు (జెన్నీ) ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా, జెన్నీ, పీవీ కృష్ణ ప్రసాద్ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సంజయ్ కుమార్, అంజలి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వీరిద్దరికి ఇది తొలి సినిమా.

యూత్‌ఫుల్ కంటెంట్‌తోపాటు, యువతకు, తల్లిదండ్రులకు సందేశాన్నిచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా, ఫిల్మ్ చాంబర్‌లోని థియేటర్‌లో ప్రివ్యూ కూడా పూర్తి చేసుకుంది. ఈ ప్రివ్యూకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. సినిమా యూనిట్‌ను అభినందించారు. సుద్దాల అశోక్ తేజ, కులశేఖర్ పాటల రూపంలో చక్కటి సాహిత్యాన్ని అందించారు. టీ సురేంద్ర రెడ్డి డీవోపీగా, శర్వాని శివకుమార్ ఎడిటర్‌గా పని చేశారు. కృష్ణ సాయి సంగీత దర్శకులుగా చేశారు. అనంత్, విశ్వమోహన్, నూతి శ్రీకాంత్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను యూనిట్ ప్రకటించనుంది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?