Sunny Leone Mandira New Movie Poster:బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆమె నటించే ప్రతి మూవీలోనూ బోల్డ్ సీన్లతో కుర్రకారు మతిపోగొడుతుంది. ఇక సన్నీ లియోన్ ప్రస్తుతం సినిమాలకు కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమెకు తెలుగులో చివరి చిత్రం విష్ణు మంచు హీరోగా నటించిన జిన్నా మూవీ. అందులో సన్నీ లియోన్‌కి మాత్రం మంచి రోల్ పడింది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న రోల్‌లో సన్నీలియోన్ కనిపించింది. కాస్త హారర్, సైక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అవ్వడంతో సన్నీ లియోన్‌కు మంచి పాత్రే పడింది. మళ్లీ అలాంటి ఓ మూవీలోనే సన్నీ లియోన్ సందడి చేసేందుకు టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
మందిర అనే మూవీతో సన్నీ లియోన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ మూవీ ద్వారా ఆడియెన్స్‌ని భయపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నిరకాల ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. మందరి మూవీలో సన్నిలియోన్ మెయిన్ రోల్‌లో కామెడీ కాన్సెప్ట్‌తో ఈ మూవీలో సందడి చేయనుంది. ఈ మూవీని విజయ్ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్ములపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read:డేట్ ఫిక్స్, ఓటీటీలోకి టిల్లు స్క్వేర్ ఎంట్రీ అప్పుడే..!
తాజాగా మందిర మూవీకి సంబంధించిన టైటిల్, సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఈ పోస్టర్‌లో సన్నీ లియోన్‌ను గమనిస్తుంటే భయపెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ యూనిట్ బిజీబిజీగా ఉంది. త్వరలోనే మిగిలిన డీటెయిల్స్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఇక సన్నీ లియోన్ బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్లలో ప్రాజెక్టులు చేస్తూ అప్పుడప్పుడు ఐటం సాంగ్స్‌లోనూ మెరుస్తుంటుంది.మరి ఈ మూవీ అయినా సన్నీకి సిల్వర్ స్క్రీన్ మీద మంచి బ్రేక్ ఇవ్వనుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.