Sreya Dhanvanthari on Fitness India Magazine cover page:
అందాల ప్రదర్శనలో పెద్దగా హద్దులు లేకుండా చేసే శ్రేయా ధన్వంతరి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె గ్లామర్ షోకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు విమెన్ ఫిట్ నెస్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్రత్యేకంగా ఫోజులిచ్చింది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి పెర్ఫెక్ట్ షేప్స్ తో హాట్ స్టిల్ లో శ్రేయా ధన్వంతరి మాయ చేస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా పరిశ్రమలో ఎవరి లక్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. కొంతమందికి రాత్రికి రాత్రే టాప్ పొజిషన్ అవకాశాలు వస్తే మరికొందరికి ఆలస్యంగా వస్తుంటాయి. ఒకప్పుడు అయితే సినిమాలు ఫ్లాప్ అయితే మళ్లీ ఆ హీరోయిన్ జోలికి వచ్చేవారు కాదు నిర్మాతలు. వారిపై ఐరన్ లెక్ ముద్ర పడిపోతుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో వెబ్ సిరీస్ లు అలాంటి హీరోయిన్లకు అండగా నిలుస్తున్నాయి. అలా ఒక్క వెబ్ సిరీస్ తోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి. అసలుసిసలు తెలుగమ్మాయి. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శ్రేయ ఎక్కువగా ఢిల్లీతోనే అనుబంధం పెంచుకుంది. వరంగల్ లోని నిట్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఫైనల్ ఇయర్ లో ఉండగానే ఫెమీనీ మిస్ ఇండియా సౌత్ కు ఎంపికయింది. ఫైనలిస్ట్ గా పోటీపడి తెలుగు సత్తా చాటింది.
మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ
అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రేయ. ముందుగా నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కలిసి రాని:అయితే 2009లో వచ్చిన జోష్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో శ్రేయ ధన్వంతరి పెద్దగా వెలుగులోకి రాలేకపోయింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహ గీతం చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు అది కూడా కలిసి రాలేదు. ఇలా తెలుగు సినిమాలు వరుసగా తన సినీ జీవితానికి పెద్దగా ఉపయోగపడకపోవడంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ స్టన్నింగ్ బ్యూటీ. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ శ్రేయ ధన్వంతరి అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది. యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు చేపట్టి మల్టీ టాలెటెండ్ అనిపించింది.