sonakshi sinha celebrate her bachelorette with humariends
Cinema

Actress Sonakshi: ఫొటోలు వైరల్‌, పెళ్లికేనా అంటూ..!

Actress sonakshi sinha celebrate her bachelorette with humariends:బాలీవుడ్‌ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలు నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ నటుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ జంట ఈ నెల 23న పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ బాలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు.

ఇక పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో సోనాక్షి, జహీర్‌ ఇక్బాల్‌ తమ ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక ఈ వార్త విన్న నెటిజన్స్‌ హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్ అంటే రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Also Read: అదిరిపోయే అప్డేట్‌

ఇక ఇదిలా ఉంటే గతంలోనే ఈ జంట వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ముంబయి శివారులోని విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. వీరి వివాహ ఆహ్వాన పత్రిక మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ థీమ్‌తో రూపొందించినట్లు, దానిపై ది రూమర్స్‌ ఆర్‌ ట్రూ (పుకార్లు నిజమే) అనే క్యాప్షన్‌తో ఈ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను అతిథులకు అందించినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!