Simbu Is The Hero Who Will Make A Fuss With Two Girls: కొన్నాళ్ళు వరుస ప్లాపులతో డీలాపడ్డ కోలీవుడ్ స్టార్ హీరో శింబు మనాడు బ్లాక్ బస్టర్ మూవీతో కం బ్యాక్ దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా పాతు థలా మూవీతో మరో సక్సెస్ అందుకుని పుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం లోకనాయకుడు కమల్‌హాసన్ సంచలన దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న థగ్‌లైఫ్ మూవీలో సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ వెంటనే కమల్‌హాసన్ నిర్మాణంలో ఓ మూవీని చేయనున్నాడు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లను తీసుకోనున్నట్లు మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను దించుతున్నారట.
అందులో శ్రీదేవి ముద్దుల కూతురు నటి జాన్వీ కపూర్. మరొకరు హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ ఇద్దరిలో ఆల్రెడీ కియారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ ఇయర్ జాన్వీ కపూర్ కూడా హీరోయిన్‌గా తెలుగులో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవర మూవీతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా ఎంట్రీకి రెడీ ఇవ్వనుంది. జాన్వీ ఇప్పటివరకు అక్కడ హిట్‌ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ హిట్ పడకున్నా కూడా జాన్వీకపూర్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ ఎన్టీఆర్‌కి జోడీగా దేవర మూవీలో నటిస్తూనే, మరోవైపు రామ్‌చరణ్‌కి జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీని చేస్తుంది. ఇక మరో వైపు రామ్‌చరణ్‌కి జోడీగా గేమ్ చేంజర్‌లో కియారా అద్వానీ నటిస్తోంది. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇంతటి క్రేజ్ ఉన్న ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే మూవీలో కలిసి యాక్ట్ చేస్తే కచ్చితంగా చాలా పెద్ద మ్యాటర్ అనే చెప్పాలి.
Also Read:రేవ్ పార్టీపై హీరో సంచలన వ్యాఖ్యలు
తాజాగా తమిళస్టార్ హీరో శింబు త్వరలో నటించబోతున్న మూవీలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. ఇక శింబు హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమా కమల్‌హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతుండగా, దేశింగు పెరియాస్వామి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందబోతుంది. ఇక ఈ మూవీలో శింబు డబల్ రోల్ చేయనున్నాడు. అలా శింబు రెండు పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో ఆయనకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ కూడా బాలీవుడ్ నుంచి తీసుకురావడం వల్ల పాన్ ఇండియా రేంజ్‌లో మూవీని తెరకెక్కిస్తున్నారట. ఇది ఖచ్చితంగా బిగ్ సర్‌ప్రైజింగ్ అప్డేట్ అనడంలో సందేహం లేదంటున్నాయి తమిళ ఫిల్మ్ వర్గాలు.