Shocking News Actress Kajal Is Not In Bharatiyadu 2: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ భారతీయుడు 2.27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ మూవీతో లోకనాయకుడు కమల్‌హాసన్ మరోసారి వండర్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు ఈ మూవీలో హీరో సిద్ధార్థ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌లో సిద్ధార్థ్ ఉండగా, సెకండ్ పార్ట్‌లో కమల్‌హాసన్ ఎంట్రీ ఉంటుందని క్లారిటీగా అర్ధమవుతోంది. దీంతో సెకండ్ పార్ట్‌లో కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తూ తప్పు చేసిన వాళ్లని ఏ విధంగా శిక్షిస్తాడు అనేది చాలా ఇంట్రెస్ట్‌గా ఉండనుందని టాక్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆడియెన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీలో కమల్ హాసన్, సిద్ధార్థ్‌తో పాటుగా రకుల్ ప్రీత్‌సింగ్, ఎస్‌జే సూర్య, కాజల్ వంటి స్టార్స్ మెయిన్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. కాజల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత భారతీయుడు 2 తో కాజల్ కమ్‌బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు.
Also Read: బికినీలో కృష్ణగాడి ప్రేమగాథ నటి
కానీ ఈ మూవీలో కాజల్ పార్ట్ అసలు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ భారతీయుడు 2లో కాకుండా భారతీయుడు 3లో మాత్రమే కనిపించనుందనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. కాగా భారతీయుడు 2 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది.