Renu Desai
Cinema

Renu Desai: నేను కాదు.. పవన్ కళ్యాణే

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ సెపరేట్‌గా ఉంటున్నా.. సోషల్ మీడియాలో కొంతమంది వారిద్దరి దాంపత్యాన్ని తరుచూ గుర్తు చేస్తుంటారు. చాలా వాటిలో రేణు దేశాయ్‌ని నిందిస్తున్నట్టు ఉంటుండటంతో ఆమె ఘాటుగానే రియాక్ట్ అవుతుంటారు. చాలా సార్లు ఆమె స్పష్టత ఇచ్చారు. అలాంటి వాటిని గుర్తు చేయొద్దని, అసందర్భంగా, అవసరమైన కామెంట్లు చేయవద్దని సూచిస్తున్నా.. కొందరు తీరు మార్చుకోవడం లేదు. తాజాగా.. ఆమె ఓ నెటిజన్ పై సీరియస్ అయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇంట్లో జరిగిన ఓ పండుగ, హోమం గురించి వివరిస్తూ.. ఇలాంటి పండుగలకు ఇంట్లో స్వయంగా ప్రసాదం చేస్తుంటారని, అలా చేయడం తనకు సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఇలా తన గురించి, ఓ సంతోషకరమైన విషయాన్ని పంచుకుంటున్న ఈ పోస్టు కింద కూడా కొంతమంది అనవసరమైన కామెంట్లు చేశారు. దీంతో ఆమె ఆగ్రహించారు. వారికి హితబోధ చేశారు.

‘వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఒపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ, ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏదేమైనా ప్రతీది విధి నిర్ణయిస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం వది’ అంటూ ఓ వ్యక్తి ఆమె పోస్టు కింద కామెంట్ పెట్టాడు.

రేణు దేశాయ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా కామెంట్ పెట్టేవారు కాదు. ఆయన వదిలేసి పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నాకు ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్స్ పెట్టి’ అంటూ నిట్టూర్చారు.

మరొకరు.. అన్నదగ్గర లేకున్నా బాగా పూజలు చేస్తున్నారు అని కామెంట్ చేయగా.. ‘అన్నదగ్గర లేకపోయినా.. అంటే ఏమిటీ? నాకు నా సొంత లైఫ్ ఉండకూడదా? ఇలాంటి కామెంట్లతో మీరు నిజంగా నన్ను బాధపెడుతున్నారు’ అని పేర్కొన్నారు.

తీన్మార్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్‌కు రష్యా మాడల్ లెజ్నెవాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమించుకుని 2013లో పెళ్లి చేసుకున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!