సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న (Rashmika Mandanna) తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘‘ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండి’’ అని రాసుకొచ్చారు. తాను ధరించిన టీ షర్ట్ మీద కూడా దయ అనే రాసి ఉంది. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండ జిమ్‌లో కలిసి కనిపించిన వీడియో హల్ చల్ చేసింది. అయితే, జిమ్‌లో నుంచి బయటకు వచ్చిన విజయ్ కారులో కూర్చోగా.. రష్మిక కాలికి ఉన్న గాయం కారణంగా ఇబ్బందిపడుతూ కారు ఎక్కారు. ఈ వీడియోపై కొందరు విజయ్‌ను విమర్శిస్తున్నారు. రష్మికకు సాయం చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక పోస్ట్ వైరల్‌గా మారింది.