Cinema

Vishwaksen: అమ్మాయిగా మారిన హీరో, ఎవరంటే..?

Rakshit Atluri Operation Raavan Movie Release Date Announced: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ యాక్ట్‌ చేసిన తాజా సినిమాలు వరుసగా గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి. ఈ రెండు సినిమాల‌తో బంఫర్‌ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీస్ కంప్లీట్‌ అయ్యాక బ్రేక్‌ లేకుండా వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టి దూసుకుపోతున్నాడు. ఇక విశ్వ‌క్ యాక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్‌ల‌లో ఒక‌టి వీస్‌ 12. లైలా అనే టైటిల్‌తో వ‌స్తున్న ఈ మూవీకి కొత్త దర్శకుడు రామ్‌నారాయణ్ డైరెక్షన్‌ వ‌హించ‌బోతున్నాడు.

ఈ మూవీ బుధవారం అఫీషియల్‌గా పూజ కార్య‌క్రమాలను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఈ వేడుక‌కు దర్శక దిగ్గజం కే రాఘవేంద్రరావు ముఖ్యఅతిథిగా వచ్చి ముహూర్తం క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసాడు.ఈ మూవీలో ఇంకో అదిరిపోయే అప్డేట్ ఏంటంటే హీరో విశ్వక్‌సేన్ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం కోసం లేడీ గెటప్‌లో దర్శనమివ్వబోతున్నాడు. ఈ సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఆకాంక్ష శర్మ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌.

Also Read: సైకో కిల్లర్‌గా మారిన పలాస హీరో

తనిష్క్‌ బాగ్చి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ మొదటిసారిగా అమ్మాయి రోల్ చేస్తున్నాడు. దీంతో ఈ మూవీ అనౌన్స్ చేసినప్పట్నుంచి ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ తన ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌ అమ్మాయిగా యాక్ట్‌ చేస్తుండటంతో ఈ మూవీ కోసం అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు ఆడియెన్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటనలో తెలిపింది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?