Pushpa 2 Second Single Sooseki Lyrical Song Is Out Now
Cinema

Pushpa 2 Song: పుష్ప కమ్‌ బ్యాక్‌, సాంగ్‌ తగ్గేదేలే..!

Pushpa 2 Second Single Sooseki Lyrical Song Is Out Now: టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా, గ్లోబల్‌ మూవీ లవర్స్‌ని ఎంతగానో అలరించి సంచలనం సృష్టించిన సినిమాల్లో పుష్ప ది రూల్‌ ఒకటి. ముందుగా అనౌన్స్‌మెంట్‌ ప్రకారం సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ను మూవీ యూనిట్‌ లాంఛ్ చేశారు.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్ పోషిస్తున్న ఈ మూవీకి సుకుమార్ డైరెక్షన్‌ వహిస్తున్నాడు. పుష్ప ప్రాంఛైజీలో వస్తున్న ఈ మూవీలో కన్నడ సోయగం రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఆగ‌స్టు 15న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది ఈ మూవీ. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేశారు. కాగా ఇప్పుడు మూవీ లవర్స్‌ ఫోకస్ అంతా పుష్ప సెకండ్ సింగిల్ సూసేకి తెలుగుపైనే ఉంది. ఈ పాటను రిలిక్ రైటర్‌ చంద్రబోస్‌ రాశారు. పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలన్నింటిలో పాడటం ఈ సాంగ్‌కి ఓ హైలైట్‌.

Also Read: ఎన్‌కేఆర్‌ లేటెస్ట్‌ గ్లింప్స్ అదుర్స్

ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సాంగ్‌ లుక్‌లో బన్నీ బ్లాక్‌ డ్రెస్‌లో కనిపిస్తుంటే రష్మిక బ్లాక్ ప్యాంట్‌ టీ షర్ట్‌లో వోణీ వేసుకుంది. ఈ సాంగ్‌ కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టడం ఖాయమని లిరికల్‌ వీడియో సాంగ్‌ చెప్పకనే చెబుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ పుష్ప పుష్ప సాంగ్‌ నెట్టింట మిలియన్లలో వ్యూస్ రాబడుతోంది.ఈ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ మూవీలో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు