Pan India Hero Prabhas Donated 35 Lakhs Once Again: పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రభాస్ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ మూవీతో హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు.
కాగా..ప్రభాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మంచితనం కలిగినవాడు. ఫ్యాన్స్‌ని, ఫ్రెండ్స్‌ని డార్లింగ్ అంటూ అప్యాయంగా పలకరిస్తూ తన మంచి మనసుని చాటుకుంటాడు. అంతేకాదు షూటింగ్‌లో ఉన్నా..తన ఇంటికి వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తాడు. ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రెటీలు మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తనకు నచ్చిన వారికి సాయం చేసేందుకు ముందుంటాడు ప్రభాస్. ఈ క్రమంలో డైరెక్టర్స్‌కి డొనేషన్ ఇచ్చాడు.
Also Read:అందులోనూ తగ్గేదేలే అంటున్న సమంత
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 లక్షలను డొనేట్ చేసి భళా అనిపించుకున్నాడు. దీంతో దర్శకుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ వార్త ఆ నోట ఈ నోట వైరల్ అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఫిలిం డైరెక్టర్ అసోషియేషన్ మే 4న దాసరి నారాయణరావు బర్త్‌డే వేడుకను ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లను ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులంతా హాజరుకానున్నారు.