Palasa Is A Psycho Killer Turned Hero: టాలీవుడ్‌లో రిలీజైన పలాస, నరకాసుర లాంటి హిట్ సినిమాలతో మెప్పించిన హీరో రక్షిత్ అట్లూరి త్వరలో ఆపరేషన్ రావణ్ క్రైం, థ్రిల్లర్ మూవీతో అలరించేందుకు మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన జంటగా సుధాస్ మీడియా బ్యానర్‌పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో ఈ ఆపరేషన్ రావణ్ మూవీ తెరకెక్కుతుంది.
సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, రఘు కుంచె ఈ మూవీలో మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఆల్రెడీ ఆపరేషన్ రావణ్ మూవీ నుంచి టీజర్, సాంగ్ కూడా గతంలో రిలీజ్ చేసారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసారు మూవీ యూనిట్.
Also Read: మహేష్ ని ఢీ కొట్టేందుకు సిద్ధం?
ఆపరేషన్ రావణ మూవీ ఆగస్టు 2న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కంప్లీట్‌గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని ఫస్ట్ థ్రిల్ వీడియోలో స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ సినిమాని సైకో స్టోరీ అని, మీ ఆలోచనలే మీకు శత్రువులు అని సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.