New Complications For Actress Janhvi Kapoor
Cinema

Jaanvi Kapoor: పాపం..భామకి కొత్త చిక్కులు

New Complications For Actress Janhvi Kapoor: మనం అనుకున్నవన్నీ జరగవు. జరిగేవాటిని మనం ముందుగానే ఊహించలేం. ఎందుకంటే ఇది జీవితం కాబట్టి. అచ్చం ఓ నటి విషయంలోనూ సేమ్‌ టూ సేమ్‌ సీన్‌ జరిగింది. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారుసురాలిగా అరంగేట్రం చేసింది జాన్వీకపూర్. ఈమె తండ్రి బోనీకపూర్‌ హిందీతో పాటు కొన్ని తమిళ మూవీస్‌ని నిర్మించారు. ఈ మధ్య అజిత్‌ హీరోగా తుణివు వంటి విజయవంతమైన మూవీని సైతం నిర్మించారు.

కాగా బాలీవుడ్‌లో నటిగా పరిచయమై రాణిస్తున్న జాన్వీకపూర్‌కు తన తల్లి మాదిరిగానే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యాక్ట్ చేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నది తన ఆశ. ఈ విషయాన్ని పలుసార్లు ఆమె స్వయంగా రివీల్ చేసింది. అలాగే టాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. దేవర మూవీలో టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నాయకిగా యాక్ట్ చేస్తుంది. త్వరలో రామ్‌చరణ్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. ఇకపోతే కోలీవుడ్‌లో కూడా నటించాలని జాన్వీకపూర్‌ చాలా ఆశగా ఉందట. అలా ఒక పాన్‌ ఇండియా మూవీలోనూ యాక్ట్ చేయడానికి కమిట్‌ అయ్యింది. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రూపొందనుందనని తెలుస్తోంది. కాగా మహాభారతం ఇతివృత్తంతో సాగే ఈ మూవీకి కర్ణ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టాక్‌.

Also Read: మలేసియాలో వండర్ రియాక్షన్‌

ఇందులో కర్ణుడిగా హీరో సూర్య యాక్ట్ చేస్తున్నారని, ఆయనకు జంటగా నటి జాన్వీకపూర్‌ ఎంపికైనట్టు ప్రచారం జోరుగా సాగింది. త్వరలో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. ఉన్నట్టుండి ఏమైందో గానీ ఇప్పుడీ మూవీ డ్రాప్‌ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక ఇదే విషయం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే తాజాగా హీరో విజయ్‌తో మరో మూవీతో జాన్వీకపూర్‌ నాయకిగా చేయనున్నట్లు టాక్‌. అయితే ఈ ప్రచారం అయినా నిజం అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడకతప్పదు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?