Avaneet | నిజంగా నువ్వు గ్రేట్ అంటూ నెటిజన్స్‌ ఫిదా
Netizens Say You Are Really Great
Cinema

Avaneet: నిజంగా నువ్వు గ్రేట్ అంటూ నెటిజన్స్‌ ఫిదా

Netizens Say You Are Really Great: తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకు భారతీయులు పెద్దపీట వేస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్థత్వం కలిగి ఉంటారు. కలలు నెరవేరినప్పుడు ఎంత సంతోషపడతారో అందుకు తోడ్పడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు అంతే ముందుంటారు. కొన్నిసార్లు ఆ ఆశయాన్ని సాధించడం ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. తాజాగా అవనీత్‌ కూడా ఒకింత సంతోషంగా మరింత గర్వంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.తొలిసారి ఆమె కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పార్టీసిపెట్‌ చేసింది.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్‌ చలన చిత్రోత్సవాలలో రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. మే 23న ఎర్ర తివాచీపై వయ్యారంగా నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ తనకు ఇంత గొప్ప ఛాన్స్ వచ్చినందుకు గానూ నేలకు నమస్కరించి ఆ తర్వాత అక్కడ రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోయింది. ఇది చూసిన జనాలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తన కలలు నెరవేరాయి. ఆమె కష్టాన్ని మనం తప్పకుండా గుర్తించి తీరాల్సిందే. నేలకు నమస్కరించి తను ఒక అచ్చమైన భారతీయురాలు అని నిరూపించింది ఈ వార్త చూసిన నెటిజన్స్ అని కామెంట్లు చేస్తున్నారు.

Also Read:డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్

అంతేకాదు తను ఎంత ఎత్తుకు ఎదిగిన తన భారతీయ మూలాలను మరవకుండా ఉందని తనకి కితాబు ఇస్తున్నారు. కాగా మర్దాని మూవీతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన అవనీత్‌ బ్రూనీ, ఏక్తా, చిడియాఖన్నా, టికు వెడ్స్‌ షెరు వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె లవ్‌ కీ అరేంజ్‌ మ్యారేజ్, లవ్‌ ఇన్‌ వియత్నాం వంటి సినిమాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)

Just In

01

Farmer Sells Kidney: రోజుకు రూ.10 వేల వడ్డీతో రూ.1 లక్ష అప్పు.. భారం రూ.74 లక్షలకు పెరగడంతో కిడ్నీ అమ్ముకున్న రైతు

Polling Staff Protest: మధ్యాహ్న భోజనం దొరకక ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన

Delhi Government: ఆ సర్టిఫికేట్ లేకుంటే.. పెట్రోల్, డీజిల్ బంద్.. ప్రభుత్వం సంచలన ప్రకటన

Champion: ‘ఛాంపియన్’ కోసం ‘చిరుత’.. శ్రీకాంత్ తనయుడికి కలిసొచ్చేనా?

Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి