Movies That Will Grand Festival In Tollywood
Cinema

Tollywood Industry: టాలీవుడ్‌లో సందడి చేయనున్న మూవీస్‌

Movies That Will Grand Festival In Tollywood: ఈ ఏడాది జూన్‌ నెలలో బిగ్‌ సినిమాల కోలాహలం షురూ కానుంది. అగ్ర తారలంతా తమ సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసి, ఫ్యాన్స్‌లో జోష్‌ నింపేందుకు పోటీ పడనున్నారు. జాతీయ అవార్డు పొందిన మహానటి మూవీని రూపొందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ కల్కి 2898 ఏడీ. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్, హీరోయిన్లు దీపికా పడుకొనే, దిశా పటాని కీ రోల్స్‌ పోషించారు.

ఇక ఇదే వరుసలో హీరో ధనుష్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన మూవీ రాయన్. ఈ మూవీకి ఆయనే హీరోగా, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్ధ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చగా, జూన్ 13న రిలీజ్‌ కానుంది. ఇక టాలీవుడ్ హీరో రామ్ యాక్ట్ చేసిన యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్. 2019లో రిలీజై మాస్ టాక్ తెచ్చుకున్న ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ మూవీ. ఈ మూవీకి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ మెయిన్‌ రోల్‌లో నటిస్తున్నారు. జూన్ 14న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది.

ఇక పా రంజిత్ డైరెక్షన్ చేసిన మూవీ తంగలాన్. కోలార్ గనులకు సంబంధించిన హిస్టారికల్ స్టోరీతో రూపొందింది ఈ మూవీ. ఇందులో చియాన్ విక్రమ్ హీరోగా నటించగా.. జియో స్టూడియోస్, స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విక్రమ్ సరసన మాళవిక మోహనన్ యాక్ట్ చేయనున్నారు. ఈ మూవీ కూడా జూన్‌లోనే రానుండగా, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మరోపక్క అందాల నటి కాజల్ అగర్వాల్ బిడ్డ పుట్టాక కాస్త బ్రేక్‌ ఇచ్చి రీ ఎంట్రీకి సిద్దమైంది. ఆమె నటించిన 60వ తాజా మూవీ సత్యభామ. ఈ మూవీ జూన్ 7న రిలీజ్ అవుతోంది. సత్యభామ మూవీకి రచయిత, దర్శకుడు సుమన్ చిక్కాల డైరెక్షన్‌ వహించాడు. ఇక మరో హీరో విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మూవీ మహారాజా. ఈ మూవీ జూన్ 14న రిలీజ్‌కు రెడీగా ఉంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతిరాజా, అభిరామి, మమతా మోహన్‌దాస్‌లు నటించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!