Megastar Daughter Srija Konidela Ex Husband Sirish Bharadwaj Passed Away
Cinema

Sirish: అనారోగ్యంతో మెగాస్టార్ కూతురు మాజీ భర్త మృతి

Megastar Daughter Srija Konidela Ex Husband Sirish Bharadwaj Passed Away: టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ బుధవారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్‌ని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఊపిరితిత్తులు పనిచెయ్యకపోవడంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది.

అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్‌ భరద్వాజ్‌ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే, కొంత కాలంగా శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు.అయితే శిరీష్ భరద్వాజ్ గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని శిరీష్ స్నేహితులు, సన్నిహితులు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?