Preethi mukhandan
Cinema

Kannappa: ముకుందన్ .. యాక్షన్ లో ధనాధన్

Manchu Vishnu Kannappa action scenes by Preethi Mukundan:
మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మంచబోతున్న కన్నప్ప శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఒక్కసారిగా ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డైలాగ్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు తో పాటు మోహన్ బాబు, శివరాజ్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మధుబాల, కాజల్ అగర్వాల్ సహా అనేక మంది భాగమయ్యారు. దీంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఊహించినట్లే విజువల్ ఫీస్ట్ గా మూవీ ఉండనున్నట్లు టీజర్ చూస్తుంటే ఈజీగా అర్ధమవుతుంది. సినిమాలో నటిస్తున్న తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల టాప్ స్టార్లంతా ఇలా వచ్చి అలా కనిపించి వెళ్లారు. భక్త కన్నప్పగా మారిన తిన్నడు పాత్రలో హీరో మంచు విష్ణు ఒదిగిపోయారు. యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా అదరగొట్టారు.

ఎవరీ ప్రీతి ముకుందన్?

టీజర్ లో యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంది. గ్లామరస్ గా కూడా కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఓ రేంజ్ లో స్టంట్స్ చేస్తూ ఫిదా చేసింది. అయితే ఆమె ఎవరో కాదు తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్. దీంతో ఆమె గురించి తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. కన్నప్పలో హీరోయిన్ గా తొలుత నుపుర్ సనన్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. కొన్ని రోజుల పాటు షూటింగ్ లో కూడా ఆమె పాల్గొంది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సినిమా నుంచి నుపుర్ తప్పుకుంది. ఆ తర్వాత ఆడిషన్స్ లో ప్రీతి ముకుందన్ ను సెలెక్ట్ చేశారు మేకర్స్. క్యాడ్బరీ డైరీ మిల్క్ వంటి వివిధ యాడ్స్ లో యాక్ట్ చేసి మంచి పాపులర్ అయింది ప్రీతి ముకుందన్. ముట్టు ము2 మ్యూజిక్ ఆల్బమ్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. కోలీవుడ్ లో రీసెంట్ గా స్టార్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ సినిమాతో అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల యంగ్ హీరో శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీలో యాక్ట్ చేసింది ప్రీతి ముకుందన్. ఇప్పుడు కన్నప్పతో పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేసేందుకు రెడీ అయింది. అయితే కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుని యాక్ట్ చేస్తోంది ప్రీతి ముకుందన్. భారీ హిట్ కొట్టాలని ట్రై చేస్తోంది. టాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. మరి ఈ బ్యూటీకి ఫ్యూచర్ లో ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ