Prithviraj sukumeran in mahesh babu movie
కల్కి పాన్ ఇండియా రికార్డు బ్రేక్ కలెక్షన్లతో మళ్లీ టాలీవుడ్ హిట్ పట్టాలనెక్కింది. దీనితో అగ్ర దర్శకుడు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయక పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక దాదాపు ఖాయమైనట్టు సమాచారం. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ‘ది గోట్ లైఫ్’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
అలాగే సలార్ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు.
ఇప్పటివరకూ చేసిన చిత్రాలకంటే భారీగా, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టే నటీనటులు, సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు.యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రం హీలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ సైతం మార్చేశాడు. బరువు పెరగంతో పాటు.. హెయిల్ స్టైల్ కూడా చేంజ్ చేశాడు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో స్టార్ట్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.