MAD Square Trailer: ప్రస్తుతం, తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద హిట్ గా నిలుస్తున్నాయి. ఇక కొన్ని చిత్రాలు అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి సత్తా చాటుతున్నాయి. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని సీక్వెల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పార్ట్ 1 థియేటర్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తే.. సెకండ్ పార్ట్ బాక్సాఫీసును చిత్తు చిత్తు చేయడం పక్కా ..! అలా గతేడాది కొత్త కథతో మన ముందుకొచ్చింది ” మ్యాడ్ ” ( Mad ) మూవీ. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పాటల దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. పేరుకి తగ్గట్టే యూత్ కి సినిమా పిచ్చెక్కించింది. మరి, ఇంత క్రేజ్ సంపాదించుకున్న సినిమాకి సీక్వెల్ లేకుండా ఉంటుందా .. త్వరలో ‘మ్యాడ్ స్వేర్’ ( Mad Square) తో మనందర్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
అసలు హిట్ అవుతుందా.. లేదా అనుకున్న మూవీ .. బాక్సాఫీస్ దగ్గర ఊహించలేని కలెక్షన్లతో దుమ్మురేపింది. అయితే, మ్యాడ్ కి మించి ఈ సారి ఎక్సట్రా ఫన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మనందర్ని ఎంటర్టైన్ చేయడానికి చిత్ర టీం సిద్దమవుతుంది. ఈ మూవీలో జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ( Narne Nithin ) , రామ్ నితిన్ (Ram Nithin ) , సంగీత్ శోభన్ ( Sangeet Sobhan ) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టోరీ మొత్తం ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతుంటుంది. సాధారణంగా ట్రైలర్ చూస్తే ఒక సినిమా కథ ఈ విధంగా ఉంటుందని చెబుతుంటారు. కానీ, అలా చెప్పడం చాలా కష్టమని, దీనిలో స్టోరీనే లేదని నిర్మాత ఓ ప్రెస్ మీట్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు. మరిఎం ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే .. ఈ చిత్రం కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
2023లో మన ముందుకొచ్చిన మ్యాడ్ మూవీకి, సీక్వెల్‌గా ఈ చిత్రానికి చాలా తేడా ఉంది. వరల్డ్ వైడ్ గా.. ఈ నెల 28న థియేటర్లలో సందడీ చేయనుంది. ఈ క్రమంలోనే మూవీ టీం ప్రమోషనల్ కార్యక్రమాల్లో స్పీడ్ ను పెంచింది. దానిలో భాగంగానే నేడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Also Read: Jr NTR Pranathi: భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ .. వైరల్ అవుతున్న ఫోటోలు
ట్రైలర్ చూస్తుంటే.. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రేక్షకులకు బోర్ కొట్టించకూడదనే బలంగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు. అసలు.. ఈ చిత్రం ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. కేవలం యూత్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మరీ ముఖ్యంగా.. ఈ చిత్రంలో ఎలాంటి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉండవు. కామెడీతో సినిమాను మంచిగా తెరకెక్కించారు. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈమూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ను అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకం పై ప్రముఖ నిర్మాత హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ” మ్యాడ్ స్వేర్ ” మూవీకి సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా ఉన్నారు.