Sonu Sood
Cinema, ఎంటర్‌టైన్మెంట్

Sonu Sood | సోనూసూద్ కి భారీ షాక్… అరెస్ట్ వారెంట్ జారీ

ప్రముఖ నటుడు సోనుసూద్‌ (Sonu Sood) పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. చీటింగ్ కేసులో లూథియానా కోర్టు ఆదేశించినా విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముంబయిలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్‌స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్‌ కౌర్‌ వారెంట్‌ జారీ చేశారు. సోనూసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read : మ‌ఖానా.. అంత‌ర్జాతీయ సూప‌ర్ ఫుడ్‌గా ఎలా మారింది?

లూథియానా ప్రాంతానికి చెందిన లాయర్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు చీటింగ్ చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్‌ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ (Sonu Sood)ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు నటుడు సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘‘సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి’’ అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణ జరగనుంది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం