Keerthi Suresh ready to act in bold scenes change with bollywood
Cinema

Keerthi Suresh: దేనికైనా రెడీ అంటోంది

Keerthi Suresh ready to act in bold scenes change with bollywood: మహానటితో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి తర్వాత పెరిగిపోయిన క్రేజ్ సరిగ్గా ఉపయోగించుకోలేక చతికిలపడింది ఈ బ్యూటీ. తర్వాత కెరీర్ మందకొడిగా సాగుతూనే వచ్చింది. బడా హీరోలతో నటించినా రావలసినంత బజ్ రాలేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పక్కన అజ్ణాత వాసి, మహేష్ బాబు తో సర్కారు వారి పాట మూవీలేవీ ఈ భామ కెరీర్ కు హెల్ప్ అవ్వలేదు. నేను శైలజ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ బ్యూటీ. రామ్ హీరోగా నటించిన నేను శైలజ హిట్ అయింది. అయితే ఆ తర్వాత మహానటి మూవీ తప్ప చెప్పుకోవడానికి ఏ సినిమా లేకుండా పోయింది ఈ బ్యూటీకి. టాలీవుడ్ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ లో లక్ పరీక్షించుకోవాలని అనుకుంది. రీసెంట్ గా మైదాన్ మూవీ హిట్ కావడంతో ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఆఫర్లు కూడా అందుకుంటోంది ఈ మహానటి.

బోల్డ్ లుక్ తో బోలెడు ఆఫర్లు

అందం, అభినయం అన్నీ ఉన్నప్పటికీ తెలుగులో ఎందుకు ఆఫర్లు దక్కడం లేదని తెగ మదనపడిపోతోంది ఈ బ్యూటీ. అయితే అసలు విషయం ఏమిటంటే మైదాన్ మూవీలో కీర్తి తన అందాలను ఆరబోసింది. బోల్డ్ లుక్ తో కొత్త అభిమానులను కూడా పట్టేసింది. అంతా అయ్యాక ఇప్పుడు అర్థం చేసుకుంది మహానటి. ఎక్కడ తప్పు చేశాన్ో అని. ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో దాదాపు కెరీర్ అయిపోయిందని అనుకున్నారంతా. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ కూడా తన లుక్ ను బోల్డ్ గా మార్చేసింది. టిల్లు స్క్కేర్ మూవీ తర్వాత బిజీగా మారిపోయింది అను. అయితే బాలీవుడ్‌లోకి వెళ్లాక ఈ అమ్మడు స్టైల్ మొత్తం చేంజ్ చేసిదంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్ లో కూడా నటించడానికి ఒప్పుకున్నదంట ఈ చిన్నది. రుణ్ ధావన్ సరసన బేబీ జాన్ అనే చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా ఈ సినిమాలో ముద్దు సీన్స్ లో కూడా నటిస్తాను అంటూ ఓకే చేసిందట. అయితే పాపం కీర్తిని దర్శకుడు చాలా బలవతం చేశాడు.. ఆ సీన్ చేయమని అని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తూ ఈ నటి ఆసీన్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. కీర్తి ఏంటీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!