Kalki 2898 ad First Look Poster For Disha Patani Is Finally Unveile
Cinema

disha Patani: వెల్కమ్‌ డార్లింగ్‌ అంటూ స్వాగతం

Kalki 2898 ad First Look Poster For Disha Patani Is Finally Unveile: వరల్డ్‌ వైడ్‌గా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీలో టాలీవుడ్‌ హీరో డార్లింగ్‌ ప్రభాస్‌తో సహా, దిగ్గజ నటీనటులు నటించారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీపై ఫ్యాన్స్‌కి అంచనాలన్ని అమాంతం పెరిగిపోతున్నాయి.

ఇక ప్రభాస్ మ్యాటర్‌కి వస్తే ఈశ్వర్ మూవీ ద్వారా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ చేసి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు డార్లింగ్‌. ఇక తాజా​గా రిలీజైన ట్రైలర్​ హాలీవుడ్​ను తలదన్నేలా ఉంటూ భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి. జూన్​ 27 ఆడియెన్స్‌ ముందుకు రానున్న ఈ మూవీ కోసం ఓవర్సీస్​లో ఇప్పటికే బుకింగ్స్​ స్టార్ట్ అయిపోయి టికెట్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే​ కల్కి మూవీలో ప్రభాస్​తో పాటు అమితాబ్, కమల్​హాసన్​, దీపికా పదుకొణె, దిశాపటానీ ఇలా పలువురు స్టార్స్ యాక్ట్ చేశారు. ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ పేర్లను రివీల్ చేస్తూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు మూవీ యూనిట్. తాజాగా దిశాపటానీ ఫస్ట్​లుక్​ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్​డే విషెస్‌ చెబుతూ తన క్యారెక్టర్ పేరు రాక్సీగా ఇంట్రడ్యూజ్‌ చేశారు. ఈ పోస్టర్​లో దిశా గోడకు ఆనుకొని నడుము అందాలు చూపిస్తూనే మరోవైపు పవర్​ఫుల్​గా కనిపిస్తోంది. ఇక ఈమె ఫొటో చూసిన నెటిజన్లు, డార్లింగ్ ఫ్యాన్స్ అంతా వావ్ అంటూ తనకి కితాబ్‌ ఇస్తున్నారు. అంతేకాదు వెల్కమ్‌ టు కల్కి అంటూ స్వాగతం పలుకుతున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!