Pan India Hero Prabhas Kalki Movie Record Bookings
Cinema

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సాలిడ్ రికార్డ్స్‌..!

KALKI 2898 AD CREATES RECORDS BEFORE RELEASE: ఈ ఏడాది సెకండాఫ్‌లో ఎక్కువ సంఖ్యలో మూవీస్ రిలీజ్ అవుతుండగా ఆ మూవీలలో ప్రతి మూవీ బడ్జెట్, క్వాలిటీ పరంగా టాప్ రేంజ్‌లో ఉన్నాయి. అయితే టాప్ రేంజ్‌లో ఉన్న ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో హిట్‌గా నిలుస్తాయో చూడాలి.

ఇక ఇదే వరుసలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రాబోతున్న మూవీ కల్కి 2898 ఏడీ ఉంది. ఈ మూవీకి బిజినెస్ భారీ రేంజ్‌లో జరుగుతోంది. కల్కి 2898 ఏడీ ఆంధ్ర, తెలంగాణ హక్కులు ఏకంగా 190 కోట్ల రూపాయల దాకా అమ్ముడవుతున్నాయని సమాచారం. ఖచ్చితంగా ఇది ఒక సూపర్ రికార్డ్ అనే చెప్పాలి. కల్కి మూవీతో ప్రభాస్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read:క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన హరిహర వీరమల్లు టీం

కల్కి 2898 ఏడీ మూవీ బాహుబలి 2 రేంజ్ మూవీ అని ఈ మూవీకి ఎక్కువ మొత్తంలో ఖర్చయినా కలెక్షన్లు మాత్రం భారీ రేంజ్‌లో ఉండబోతున్నాయని ప్రభాస్ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీ నుంచి ట్రైలర్ మరికొన్ని అప్‌డేట్స్ వస్తే ఈ మూవీపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరుగుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ మూవీ ఖచ్చితంగా 2024 బిగ్గెస్ట్ హిట్‌గా నిలవాలని ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ నుంచి బెస్ట్ ఔట్‌ఫుట్‌ని ఆశిస్తున్నారు.ఈ మూవీలో దీపికా పదుకొనే నటిస్తోంది. సరైన రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుని రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారని సమాచారం.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌కు భారీ హిట్ అవసరం కాగా కల్కి సినిమాతో ఆ హిట్ దక్కుతుందో లేదో చూడాలి. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ మూవీలో ట్విస్టులు సైతం వేరే లెవెల్ లో ఉంటాయని సమాచారం. ఈ మూవీని మ్యాక్సిమం మే 10కి రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. ఇప్పుడు అదే అనుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ ఆ డేట్‌కి రాకుండా వాయిదా పడితే షర్వానంద్ మనమే మూవీ ఆ డేట్‌ని లాక్ చేసుకోనుందని తెలుస్తోంది.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!