Janhvi Kapoor On Rumoured Wedding Posts On Social Media
Cinema

Janvi kapoor: వారంలో పెళ్లి, ఏంది మీ లొల్లి..

Janhvi Kapoor On Rumoured Wedding Posts On Social Media: యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన తాజా మూవీ దేవర. ఈ మూవీలో నటి జాన్వీకపూర్‌ నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీతో ఆడియెన్స్‌ని పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వరుసగా సిటీల్లో పర్యటిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ను పెళ్లి గురించి ప్రశ్నించారు.

తన ప్రియుడు శిఖర్ పహారియాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగారు. దీనికి జాన్వీ కపూర్‌ సైతం నవ్వుతూనే రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జాన్వీ మాట్లాడుతూ.. ఇటీవల నేను కొన్ని వార్తలు చదివాను. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాసుకొచ్చారు. దీంతో నేను పెళ్లి చేసుకుంటున్నట్లు రెండు, మూడు కథనాలు మిక్స్ చేశారు. నాకు తెలియకుండానే వారంతా వారం రోజుల్లో నా పెళ్లి కూడా చేసేలా ఉన్నారు అంటూ నవ్వుకుంది.

Also Read: టాలీవుడ్‌ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు..!

కానీ ప్రస్తుతం నేను ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నా. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని రెడిట్‌ యూజర్లతో చిట్‌చాట్‌ చేశారు. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ భామ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ఈ నెల 31న థియేటర్లలోకి ఆడియెన్స్‌ ముందుకు రానుంది.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!