Heroine Feeling Regret For Acting In Hero Rajinikanth Movie
Cinema

Actress Comments: ఆ మూవీలో నటించి తప్పు చేశా

Heroine Feeling Regret For Acting In Hero Rajinikanth Movie: ఒకప్పుడు సౌత్‌లో హీరోయిన్‌గా మంచి ఐడెంటీటీ తెచ్చుకున్న నటి మమతా మోహన్ దాస్. టాలీవుడ్‌లో హీరో నాగార్జున యాక్ట్ చేసిన కింగ్, వెంకటేష్ నటించిన చింతకాయల రవి, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ యమదొంగ, కేడి వంటి చిత్రాలతో ఆడియెన్స్‌కు దగ్గరైంది. తెలుగుతో పాటూ మలయాళంలో యాక్ట్ చేసి భారీగా క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్‌గా కొనసాగుతున్న టైమ్‌లోనే క్యాన్సర్ బారిన పడింది ఈ భామ. దాంతో సినిమాలకు దూరమైంది.చాలా ఏళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది. గతేడాది రుద్రంగి మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇ‍చ్చింది.

ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈమె.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే రజినీకాంత్ మూవీలో అనవసరంగా నటించానని షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కిన కథానాయకుడు మూవీలో మమతా మోహన్ దాస్ ఓ సాంగ్‌లో యాక్ట్ చేసింది.

Also Read: యూట్యూబర్‌పై హీరో ఫైర్‌

ఈ సాంగ్‌ కోసం రెండు రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లిందట. అయితే ఈ మూవీ ఎడిటింగ్‌లో ఆమె పార్ట్‌ మొత్తం డిలీట్‌ చేసి కేవలం ఒక సెకను మాత్రం తెరపై చూపించారట. రిలీజ్‌ తర్వాత ఆ సాంగ్‌ను చూసి తెగ ఫీల్ అయిందట ఈ భామ. అనవసరంగా రజనీకాంత్‌ మూవీలో నటించానని అప్పట్లో తాను బాధపడ్డట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మమతా మోహన్ దాస్ పేర్కొంది.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్