Riddi kumar: యంగ్ హీరో రాజ్ తరుణ్ పక్కన లవర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రిద్దికుమార్. అయితే ఈ మూవీ రిద్దికి అంతగా పేరు తేలేదు. గుర్తింపు సైతం తీసుకురాలేదు. తరవాత అనగనగా ఒక ప్రేమకథ మూవీలో నటించింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ఫలితాన్నిచ్చింది. అయితే మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తన అవకాశాలను వెదుక్కుంది రిద్దికుమార్. వరల్డ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ మూవీలో ఓ ప్రత్యేక పాత్రలో మెరిసింది రిద్ది. అయితే రిద్ది క్యారెక్టర్ రాధేశ్యామ్ మూవీ కథను మలుపు తిప్పేది కావడంత కొద్దో గొప్పో అంతా గుర్తించడం మొదలుపట్టారు. బాలీవుడ్ మూవీ సలామ్ వెంకీలోనూ నటించింది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మూవీస్ తో పాటు మూడు వెబ్ సిరీస్ లో నటించింది రిద్ది. ఇదిలా ఉంటే నార్త్ ఇండియన్ బ్యూటీస్ గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గరు. సినిమాలలో సాఫ్ట్, డీసెంట్ క్యారెక్టర్స్ చేసినా కూడా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలతో అందాల ప్రదర్శన చేస్తూ ఉంటారు.
బ్యూటీ కంటెస్ట్ జడ్జిగా..
అలాగే పేజ్ 3 ఈవెంట్స్ లలో కూడా నార్త్ ఇండియన్ బ్యూటీస్ అందాలు కనిపించేలానే డిఫరెంట్ అవుట్ ఫిట్ లతో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా రిద్ధి కుమార్ ఓ బ్యూటీ కంటెస్ట్ కి జడ్జ్ గా అటెండ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో రిద్ధి కుమార్ గోల్డ్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి అదిరిపోయే లుక్ తో గ్లామర్ షో చేస్తూ ఎట్రాక్ట్ చేసింది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గోల్డ్ కలర్ అవుట్ ఫిట్ తో రిద్ధి ఏంజెల్ గా ఉందనే మాట ఆమె అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఈ ఫోటోతో పాటు రిద్ధి కుమార్ ఓ స్టోరీ కూడా షేర్ చేసింది. 10 ఏళ్ళ క్రితం ఇదే బ్యూటీ కంటెస్ట్ లో పాల్గొని విన్ అవ్వడం ద్వారా తన మోడలింగ్ కెరియర్ స్టార్ట్ అయ్యిందని తెలిపింది. మరల అదే షోకి ఇప్పుడు జడ్జ్ గా రావడం చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తోందని స్టోరీలో పేర్కొంది. ఏ పోస్ట్ పై నెటిజన్లు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉండటం విశేషం.