Hero Sharwanand Actress KrithiShetty Manamey Official Trailer Out Now: టాలెంటెడ్ హీరో శర్వానంద్, నటి కృతి శెట్టి జంటగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. అయితే మొదటిసారి కృతి, శర్వా కపుల్‌గా యాక్ట్ చేస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి మనమే మూవీపైనే పడింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఈ మూవీపై హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఎమోషనల్‌గా ఉండటంతో మనమే మూవీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఆడియెన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ట్రైలర్‌లో ఫ్లైట్‌లో శర్వానంద్ తన ఫ్యామిలీతో ఇతర దేశాలకు వెళతాడు. అక్కడ తన కొడుకుని సరిగ్గా చూసుకోలేదని భార్య కృతి శెట్టి ఫుల్‌గా తిడుతుంది. అయితే శర్వానంద్ తన కొడుకుకి అన్ని పనులు చేస్తాడు. అతనితో వేగలేక నా వల్ల కాదంటూ తన ఫ్రెండ్‌కు చెప్తాడు. అంతలోనే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతారు. అప్పుడు కృతి చెప్పిన డైలాగ్ అందరి మనసులు గెలుచుకుంది. ఎంత ప్రేమ పెంచుకున్నా దగ్గరవుతాం కానీ సొంతం కాలేము కదా అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసిపోతారు. కృతి జాబ్‌కు వెళ్తూ కొడుకుని చూసుకునే బాధ్యత శర్వానంద్‌ను అప్పగిస్తుంది. టైమ్ టేబుల్ ఫిక్స్ దాని ప్రకారం టాబ్లెట్స్ ఇవ్వమని చెప్తుంది.
Also Read: అలా ఎలా అంటూ రివ్యూలపై విశ్వక్ ఫైర్
దానికి టానిక్ పట్టుకుని శర్వానంద్ 30, 60 హా అని అడుగుతాడు. తర్వాత కొడుకుతో 10 ఎమ్ఎల్ హా నీకు ఇది సరిపోతుందా అని అడుగుతాడు అంతటితో ట్రైలర్ అయిపోతుంది. ప్రస్తుతం మనమే ట్రైలర్‌లో శర్వానంద్, కృతి జంట అందరినీ ఆకట్టుకుంది. ప్రజెంట్ జనరేషన్‌కు ఏదో మీనింగ్ ఇచ్చేటట్లు ట్రైలర్ ఉండగా, ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. కాగా మనమే జూన్ 7న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ గురించి మరిన్ని అప్‌డేట్స్ తెలియాలంటే మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.