Hero Sensational Comments On The Rave Party
Cinema

Rave Party: రేవ్‌ పార్టీపై హీరో సంచలన వ్యాఖ్యలు 

Hero Sensational Comments On The Rave Party: ఇటీవల హాట్‌ టాపిక్‌గా నిలిచిన బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్‌ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఇదే విషయంపై చాలామంది నెటిజన్‌లు అభిమానులు ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్‌ న్యూస్‌లో కనిపించడం లేదు అంటూ సోషల్‌ మీడియా వేదికగా అడిగారని తెలిపారు. తన న్యూ మూవీ లవ్‌ మౌళి ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో రేవ్‌ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన రియాక్ట్ అయ్యారు.

సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు అంటూ మీడియా అడగగా మంచే జరిగిందని ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. రేవ్‌ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు. సినీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ.. కొవిడ్‌ టైమ్‌లో ఆడియెన్స్‌కి ఓటీటీ బాగా దగ్గరైంది. ఇంట్లో కూర్చొనే అన్ని భాషల మూవీస్‌ని వీక్షిస్తున్నారు.

Also Read: రూమర్స్‌కి చెక్‌ పెట్టిన ఫొటో

విజువల్‌ ఫీస్ట్‌ అనిపించే అగ్రహీరోల మూవీస్ చూసేందుకు తప్ప థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. థియేటర్లలో రిలీజైన రెండు, మూడు వారాలకే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయని ఆడియన్స్‌ భావిస్తున్నారు. మా మూవీ మ్యాటర్‌కొస్తే దాని నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ మూవీ తీయొచ్చు. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. రొమాంటిక్‌ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్‌ మౌళిలో భావన సాగి హీరోయిన్‌. ఈ మూవీ జూన్‌ 7న రిలీజ్ కానుంది.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?