Hero Ramcharan Upasana Daughter Klinkara First Birthday Share Emotional Video: మెగాస్టార్ కొణిదెల చిరంజీవి పుత్రరత్నం వరల్డ్ స్టార్ రామ్‌చరణ్ కోడలు ఉపాసన దంపతుల గారాల కుమార్తె క్లీంకార వారింట్లోకి వచ్చి సరిగ్గా నేటికి ఏడాది కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా క్లీంకార ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఆ చిన్నారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా తన కుమార్తెకు విషెస్ చెబుతూ ఉపాసన ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.
నా ప్రియమైన క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా జీవితాల్లో ఆనందం నింపినందుకు ధన్యవాదాలు అంటూ విషెస్ చెప్పారు. ఇక తాను షేర్ చేసిన వీడియోను ఇప్పటికి మిలియన్ సార్లు చూసినట్లు తెలిపారు. ఆ వీడియోలో చరణ్, ఉపాసనలతో పాటు ఇరువురి కుటుంబీకులు క్లీంకార పుట్టినప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. గతేడాది ఉపాసన పుట్టినరోజు నాడు చరణ్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు దాన్నే మరోసారి ఆమె పంచుకున్నారు. పాప పుట్టిన సమయంలో తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోలో చూపించారు.
Also Read: రీ – ఎంట్రీ ఇచ్చిన నటి
క్లీంకార నామకరణ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విజువల్స్ సైతం అందులో ఉన్నాయి. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు క్లీంకారకు నెటిజన్లతో పాటు ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. లిటిల్ వండర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని కాజల్ కామెంట్ పెట్టగా హ్యాపీ బర్త్‌డే లిటిల్ స్టార్ అని కియారా అడ్వాణీ, రకుల్ ప్రీత్ సింగ్ రిప్లై పెట్టారు.
View this post on Instagram