Hero Ramcharan Game Changer Movie Schedule Reveal
Cinema

Movie Updates: గేమ్‌ ఛేంజర్ మూవీ షెడ్యూల్ రివీల్‌, ఎక్కడంటే..?

Hero Ramcharan Game Changer Movie Schedule Reveal: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా యాక్ట్ చేసిన గేమ్ ఛేంజర్ మూవీ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం హీరో రామ్‌చరణ్‌ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో చేతులు కలిపాడు. గతంలో వినయ విధేయ రామ మూవీలో నటించి ఆడియెన్స్‌ నుండి మంచి మార్కులను కొట్టేసిన బాలీవుడ్ నటి కియారా అద్వానీ, గేమ్ ఛేంజర్ మూవీలో రామ్‌చరణ్ సరసన నటించి మరోసారి సందడి చేయనుంది. ఇక ఈ మూవీ న్యూ షెడ్యూల్‌కి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ని రివీల్ చేశారు మూవీ యూనిట్‌.

ఈ మూవీ తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ 22 సోమవారం, హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. ఈ దశలో ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, రామ్‌చరణ్ ఇతర నటీనటులు ఉంటారు. మే నెలాఖరుకు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. గేమ్ ఛేంజర్‌లోని ఫస్ట్‌ సాంగ్‌ జరగండీ బుధవారం మార్చి 27 రామ్‌చరణ్ బర్త్‌డేకి విడుదలైంది. ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను కూడా మేకర్స్ షేర్ చేశారు. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మూవీ రిలీజ్‌కు సంబంధించి బిగ్‌ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఐదు నెలల్లో గేమ్ ఛేంజర్‌ని థియేటర్లలో రిలీజ్‌ చేస్తామని దిల్‌రాజు అనౌన్స్ చేశారు.

Also Read:టాలీవుడ్ ఆడియెన్స్‌ని భయపెట్టనున్న సన్నీ..!

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో హీరో రామ్ చరణ్‌తో పాటు నటి కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ వంటి అగ్రకథానాయకులు కూడా నటిస్తున్నారు. కాగా, ఈ మూవీకి థమన్ సంగీత దర్శకుడు. ఈ మూవీలో ఐదు సాంగ్స్‌ ఉన్నాయని, అందులో మూడు పాటలు ఆడియెన్స్‌ను అలరిస్తాయని దిల్ రాజు తెలిపారు. ఇక ఈ మూవీ స్టోరీని కార్తీక్ సుబ్బరాజ్ రాశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ బాణీలు అందించారు. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్ల దాకా ఉండొచ్చని చిత్రవర్గాల్లో చర్చ నడుస్తోంది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!