Tillu Square Movie | టిల్లు స్క్వేర్‌పై ప్రశంసల వెల్లువ, తాజాగా రామ్‌చరణ్‌ ఏమన్నాడంటే..!
Hero Ram Charan Has Showered Praise On Tillu Square Movie
Cinema

Tillu Square Movie: టిల్లు స్క్వేర్‌పై ప్రశంసల వెల్లువ, తాజాగా రామ్‌చరణ్‌ ఏమన్నాడంటే..!

Hero Ram Charan Has Showered Praise On Tillu Square Movie: టాలీవుడ్‌ హీరో సిద్ధూ జొన్నలగడ్డ యాక్ట్ చేసిన మూవీ టిల్లు స్క్వేర్‌. ఈ మూవీ వరుసగా భారీ కలెక్షన్లతో దూసుకెళుతూ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దీంతో మరో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సిద్దూ. మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీపై పలువురు స్టార్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీపై రివ్యూ ఇచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా టిల్లు స్క్వేర్‌ మూవీ టీమ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలతో మెచ్చుకున్నాడు.

టిల్లు స్క్వేర్ మూవీపై రామ్‌చరణ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. డియర్ సిద్ధూ నీ విజయాన్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్నందుకు అనుపమ, మల్లిక్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలంటూ రామ్‌చరణ్ పోస్ట్ చేశారు.ఇక ఇదిలా ఉంటే.. మంచి సినిమాలను ఇలా ఇతర హీరోలు ప్రశంసించడం, ప్రోత్సహించడం వంటివి ఇలానే కొనసాగాలని.. ఈ మూవీపై రివ్యూలు ఇవ్వడం ఇది చాలా మంచి విషయమంటూ నెటిజన్లు కామెంట్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Also Read: దేవర మూవీలో ఆ రోల్‌ చేయనున్న టాలీవుడ్ హీరో..!

ఇక ఈ మూవీలో ప్రిన్స్ సిసిల్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి కల్లెం కీలక పాత్రలలో యాక్ట్ చేశారు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఇందులో స్పెషల్ రోల్‌లో కనిపించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఇక ఈ మూవీ సక్సెస్ మీట్‌ సోమవారం సాయంత్రం జరగబోతుంది. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానుండటం మరో విశేషం. అంతేకాదు తన నెక్స్ట్ మూవీలోనూ సిద్దూకి ఓ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..