Hero Allu Arjun Emotional Post Her Father Photos Viral
Cinema

Icon Star: బన్నీ పోస్ట్‌ నెట్టింట వైరల్‌

Hero Allu Arjun Emotional Post Her Father Photos Viral: గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య వార్‌ నెల‌కొన్నట్టు నెట్టింట వార్తలు జోరుగా ప్ర‌చారం జరిగాయి. అందులో భాగంగానే అల్లు అర్జున్ మూలంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దూరం అయింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే ఈ వైరం గురించి నెట్టింట పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న టైంలో అల్లు అర్జున్ త‌న కుటుంబానికి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతిచ్చాడు.

ఏకంగా ఆయ‌న కోసం నంద్యాల వెళ్లి ప్ర‌చారం చేశారు. ఇక అప్పటి నుంచీ అతనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఓ పక్క హీరో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేశాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవ‌ర‌న్నా హాజరయి ఉన్నా వివాదం స‌ద్దుమ‌ణిగి ఉండేది. కానీ ఎవ‌రు రాక‌పోవ‌డంతో ఈ వివాదం మ‌రింత బలపడింది. అల్లు అర్జున్ సినిమాల‌ని ఎంక‌రేజ్ చేయోద్దంటూ కూడా మెగా ఫ్యాన్స్ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప‌2పై దీని ఎఫెక్ట్ త‌ప్ప‌క ఉంటుందని కొంద‌రు సినీ ప్ర‌ముఖులు చెప్పుకొస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గురించి అనేక ప్ర‌చారాలు, విమ‌ర్శ‌లు, రూమర్స్ న‌డుస్తున్నా కూడా ఏనాడు కూడా రియాక్ట్ అవ్వకుండా సైలెంట్‌గానే ఉన్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Also Read: నిరాశలో ఫ్యాన్స్, ఎందుకంటే..?

ఫాదర్స్ డే సంద‌ర్భంగా బన్నీ తన తండ్రి అల్లు అరవింద్ పై ప్రేమ చాటుతూ ఎమోషనల్ పిక్ షేర్ చేశాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే అంటూ బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఈ ఫొటో అల్లు అర్జున్‌కి చెందిన అమీర్‌పేట్‌లోని AAA సినిమాస్ థియేటర్ స్టార్టింగ్‌ టైంలో తీసిన పిక్. ఈ ఫొటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. బన్నీ ప్ర‌స్తుతం పుష్ప 2లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్‌ వాయిదా ప‌డే చాన్స్ క‌నిపిస్తుంది. ఇప్ప‌టికీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ కంప్లీట్ కాలేద‌ని టాక్‌. చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు థియేటర్‌లోకి వస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని డేస్ వెయిట్ చేయకతప్పదు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?