gama awards
Cinema

Gama Awards : గామా అవార్డుల ప్ర‌దానోత్స‌వం.. విజేత‌లు వీరే

Gama awards winners list : దుబాయ్‌లో AFM ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగుమూవీ అవార్డుల నాల్గవవార్షికోత్సవం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకను గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు.

కేవలం టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుకలో 2021 నుంచి 2023 మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ యాక్టర్స్ (మేల్, ఫిమేల్), ఉత్తమ సినిమా దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సింగర్ (మేల్, ఫిమేల్), ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఉత్తమ లిరిక్స్, ఉత్తమ సెలబ్రిటీ సింగర్‌తో సహా మొత్తం 42 కేటగిరీలకు అవార్డులను అందించారు.

ఈ అవార్డుల వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నటీనటులు, దర్శకులు, సింగర్స్‌తో సహా మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తమ నటులుగా ఎంపికైన నిఖిల్ సిద్ధార్థ, సందీప్ కిషన్, మంచు మనోజ్, తేజ సజ్జ, ఆనంద్ దేవరకొండ, నేహా శెట్టి, సంయుక్తా మీన‌న్, డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్, దక్ష నగార్కర్, ఫరియ అబ్దుల్లా వంటి నటీ నటులు ఈ అవార్డులు అందుకోవడమే కాకుండా అదిరిపోయే డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు.

అంతేకాకుండా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ.. గామా మూవీ ఆఫ్ ది డికేడ్ అవార్డును చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్, బెస్ట్ మూవీలుగా పుష్ప, సీతారామం, బ్రో.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లుగా దేవి శ్రీ ప్రసాద్, హేషం అబ్దుల్ వహాబ్,తమన్..

బెస్ట్ ఆల్బమ్‌గా సీతారామం – విశాల్ చంద్రశేఖర్, బెస్ట్ సింగర్స్‌గా అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్,ధనుంజయ్, ఎంఎల్ శృతి, మౌనిక యాదవ్.. ట్రెండింగ్ సాంగ్‌కు రఘు కుంచె.. గామా గద్దర్ మెమోరియల్ అవార్డు నల్గొండ గద్దర్ నరసన్న.. లెజెండరీ మ్యూజిక్ అవార్డ్ సంగీత దర్శకులు కోటి.. 25 సంవత్సరాల సంగీత దర్శకులుగా ఎం ఎం శ్రీలేఖ వంటి వారు ఈ గామా అవార్డులను అందుకున్నారు.

gama awards 2023

గామా అవార్డు అందుకున్నవీజేతలు:

గామా ఉత్తమ యాక్టర్ 2021 – అల్లు అర్జున్(పుష్ప)

గామా మూవీ ఆఫ్ ద ఇయర్2021 – పుష్ప (మైత్రిమూవీ మేకర్స్- యలమంచిలి రవి నవీన్ యెర్నేని)

గామా ఉత్తమ డైరెక్టర్2021 – సుకుమార్ (పుష్ప)

గామా ఉత్తమ హీరోయిన్ 2021 – ఫరియా అబ్దుల్లా(జాతిరత్నాలు)

గామా ఉత్తమ ప్రామిసింగ్ యాక్ట్రెస్ 2021 – ఆషికా రంగనాథ్ (అమిగోస్, నాసామిరంగ)

గామా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్2021 – దేవిశ్రీప్రసాద్ (పుష్ప)

గామా మోస్ట్ పాపులర్ సాంగ్2021 – నీలినీలి ఆకాశం (అనూప్‌రూబెన్స్)

గామా ఉత్తమ ప్లే‌బ్యాక్ సింగర్ మేల్2021 – ధనుంజయ్(నామది నీదదై)

గామా ఉత్తమ ప్లే‌బ్యాక్ సింగర్ ఫిమేల్2021 – ఎంఎల్ శృతి(అడిగా అడిగా)

గామా ఉత్తమ పాపులర్ సాంగ్2021 – మౌనిక యాదవ్(సామి నాసామి – పుష్ప)

గామా ఉత్తమ యాక్టర్2022 – నిఖిల్(కార్తికేయ-2)

గామా జ్యూరీ ఉత్తమ యాక్టర్2022 – విశ్వక్‌సేన్ (అశోకవనంలో అర్జున కళ్యాణం)

గామా ఉత్తమ హీరోయిన్2022 – మృణల్ ఠాకూర్(సీతారామం)

గామా ఉత్తమ ప్రామిసింగ్ యాక్ట్రెస్2022 – దక్షనగర్(జాంబిరెడ్డి)

గామా మూవీ ఆఫ్ ద ఇయర్2022 – సీతారామం(వైజయంతి మూవీస్.. స్వప్న, ప్రియాంకదత్)

గామా ఉత్తమ డైరెక్టర్2022 – హనురాఘవపూడి(సీతారామం)

గామా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్2022 – ఎస్ఎస్ తమన్(భీమ్లా నాయక్)

గామా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్2022 – అనురాగ్ కులకర్ణి(సిరివెన్నెల- శ్యాంసింగరాయ్)

గామా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్2022 – హారిక నారాయణ(లాహే లాహే ఆచార్య)

గామా ఉత్తమ ఆల్బమ్2022 – సీతారామం(విశాల్ చంద్రశేఖర్)

గామా ఉత్తమ యాక్టర్2023 – ఆనంద్ దేవరకొండ(బేబీ)

గామా ఉత్తమ డైరెక్టర్2023 – బాబీకొల్లి (వాల్తేరువీరయ్య)

గామా ఉత్తమ హీరోయిన్2023 – సంయుక్త మీనన్(విరూపాక్ష)

గామా ఉత్తమ ప్రామిసింగ్ యాక్ట్రెస్2023 – డింపుల్ హయతి(ఖిలాడి)

గామా మూవీ ఆఫ్‌ది ఇయర్2023 – బ్రో (పీపుల్స్ మీడియాఫ్యాక్టరీ- టిజి విశ్వప్రసాద్)

గామా జ్యూరీ ఉత్తమ యాక్టర్2023 – సందీప్‌కిషన్(మైకేల్)

గామా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్2023 – హేశంఅబ్దుల్ వహాబ్(ఖుషి)

గామా మోస్ట్ పాపులర్‌సాంగ్2023 – పూనకాలులోడింగ్ (దేవిశ్రీ ప్రసాద్)

గామా ఉత్తమ లిరిసిస్ట్2023 – కాసర్లశ్యామ్ (చంకీలా అంగీలేసి- దసరా)

గామా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్2023 – రాహుల్‌సిప్లిగంజ్ (ధూమ్‌దాం – దసరా)

గామా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్2023 – చిన్మయి(ఆరాధ్య- ఖుషి)

గామా ఉత్తమ ట్రెండింగ్ యాక్టర్ – తేజసజ్జా(హనుమాన్)

గామా లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ – డాక్టర్ కోటిసాలూరి (40ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

గామా స్పెషల్ జ్యూరీఅవార్డు – ఎంఎం శ్రీలేఖ(25ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)

గామా గౌరవ్‌సత్కర్ – చంద్రబోస్(ఆస్కార్‌విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)

గామా ఉత్తమ వర్సటైల్ యాక్టర్ – మురళీశర్మ

గామా జ్యూరీమెంబర్ – వీఎన్ ఆదిత్య(గామాజ్యూరీ)

గామా మూవీ ఆఫ్‌ది డెకేడ్ – ఆర్ఆర్ఆర్

గామా మోస్ట్ ట్రెండింగ్‌సాంగ్ – నెక్లెస్ గొలుసు (రఘుకుంచె)

గామా గద్దర్ మెమోరియల్‌అవార్డు : ఫోక్‌సింగర్ నల్లగొండ గద్దర్ నరసన్న

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం