DVV Entertainments Has Released A New Poster From PawanKalyan: ఏపీ ఎన్నికల రిజల్ట్స్ మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విసెష్ తెలిపారు. ఇక అదే సమయంలో ఆయన యాక్ట్ చేసిన మూవీల గురించి కూడా పలు అప్డేట్‌లు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఒకటి.
ఓ వైపు జనసేన అధినేతగా గెలుపొంది, మరోవైపు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న జనసేన యాక్ట్ చేసిన మూవీ ఓజీ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ అందించారు మూవీ యూనిట్. మంగళవారం ఎన్నికల ఫలితాలలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీ ఓట్లతో ఘనవిజయం సాధించడంతో రెండు పండుగలు చేసుకుంటున్నారు.
Also Read: టాలీవుడ్ హీరోతో బేబమ్మ ప్రేమాయణం
అంతేకాకుండా ఆ మూవీకి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అందులో ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచెను రగిలే రివేంజ్ అంటూ క్యాఫ్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో పవర్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. కుర్చిపై కూర్చుని కాలుపై కాలు వేసుకొని ఉన్న స్టిల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రియారెడ్డి, తేజ్ సప్రూ, అర్జున‌్‌దాస్‌తో సహా మరికొంతమంది నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీకి సుజిత్ దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు.
Evvariki Andhadhu Athani Range….
Reppa Therichenu Ragile Revenge… #OG TIME BEGINS…. #TheyCallHimOG pic.twitter.com/2cdp4E4wcP— DVV Entertainment (@DVVMovies) June 4, 2024