Director Sensational Coments About Kalki Movie
Cinema

Kalki 2898 AD: కొత్త ప్రపంచం అంటూ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Director Sensational Coments About Kalki Movie: టాలీవుడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ల కాంబోలో వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ జూన్‌ 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో యూనిట్‌ మూవీ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. కల్కి గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుందని, దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ఆడియెన్స్‌ కోసం ఈ మూవీని రూపొందించామని అన్నారు.

అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయిందని క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో దేశంలోని దిగ్గజ నటీనటులను తీసుకున్నామని అన్నారు. నన్ను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారు. నన్ను అలా పిలవడం సంతోషాన్నిస్తుందని ప్రభాస్‌ అన్నారు. ఇక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. కల్కి మూవీ చూశాక ఆడియెన్స్ మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలో ఉంటారు. నేను అవతార్‌ చూశాక అలాంటి అనుభూతే పొందాను. ఒక కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించింది. ఇప్పుడు కల్కి చూశాక థియేటర్‌లో ఉన్న ఆడియెన్స్‌కు అలానే అనిపిస్తుంది. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కోసం పెట్టాం. వీటిలో ఎలాంటి మార్పులు చేయమని స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఇందులో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఆవిష్కరించారు.

Also Read:ఎన్టీఆర్‌ మూవీకి రజినీ మూవీ సవాల్‌

ఆ వెహికల్‌ను పలు నగరాల్లో నడుపుతూ టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. చెన్నై వీధుల్లో బుజ్జి చేసిన సందడికి సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ వాహనాన్ని డ్రైవ్‌ చేయాలంటూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కోరారు. ఎక్స్‌ ట్విటర్‌ వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. అలాగే బుజ్జి, భైరవకు సంబంధించిన స్పెషల్‌ వీడియో ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా, కమల్‌హాసన్‌ విలన్‌ రోల్‌లో సందడి చేయనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీ రోల్స్‌ పోషిస్తున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!