RGV Tweet | కల్కిపై ఆర్జీవీ ట్వీట్
Director RGV Puzzle On Kalki Trailer Bumper Offer Of One Lakh If Found
Cinema

RGV Tweet: కల్కిపై ఆర్జీవీ ట్వీట్

Director RGV Puzzle On Kalki Trailer Bumper Offer Of One Lakh If Found: పాన్ ఇండియా స్టార్‌ డార్లింగ్ ప్రభాస్ యాక్ట్‌ చేసిన లేటెస్ట్‌ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీని మేకర్స్ జూన్ 27న వరల్డ్‌ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ మెయిన్‌ రోల్స్‌ పోషిస్తున్నారు.అలాగే హీరోయిన్‌లు దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్స్‌గా యాక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ విజువల్స్‌తో హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే కల్కి నుండి మరో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ దానితో కంపేర్ చేస్తే అ‍బ్బురపరిచే విజువల్స్ ఉన్నప్పటికీ ఎమోషనల్‌ కంటెంట్ బాగానే ఉంది. ఈ ట్రైలర్స్ బట్టి చాలామందికి స్టోరీ ఏంటనేది క్లారిటీగా అర్థమవుతోంది. కాంప్లెక్స్, కాశీ, శంభలా అనే మూడు ప్రపంచాలు వాటిలో మనుషుల మధ్య సంఘర్షణే మెయిన్ స్టోరీ అని తెలుస్తోంది. అన్ని బాగానే ఉన్న ఓ పాయింట్ మాత్రం సస్పెన్స్‌లా ఉండిపోయింది. దాని గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు.

Also Read: కల్కి ఈవెంట్‌లో ఫన్నీ మూమెంట్స్‌ 

అయితే తాజాగా కల్కి రిలీజ్ ట్రైలర్ చూసిన ఆర్జీవి ఫిదా అయిపోయి మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే కల్కి ట్రైలర్‌ను ట్విట్టర్ లో షేర్ చేసి ఒక పజిల్ కూడా ఇచ్చాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో కొన్ని వర్డ్స్ ఇచ్చి అందులో కొన్ని లెటర్స్ ను మిస్ చేసారు.ఈ పజిల్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి లక్ష ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన ట్వీట్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!