Comedian,Hero Sudigali Sudheer Sarkar Game Show On Aha Ott
Cinema

Sudheer Sarkaar: సుధీర్‌ న్యూ సర్కార్‌, ఫ్యాన్స్‌కి ఇక పండగంతే..!

Comedian,Hero Sudigali Sudheer Sarkar Game Show On Aha Ott: బుల్లితెరపై అందరి ఆదరాభిమానాలను చూరగొన్న కామెడీ షో..జబర్ధస్త్‌ షో. ఈ షో ఎంతోమంది కమెడియన్‌లుగానూ.. మరికొందరిని స్టార్స్ గానూ సెటిల్ అయ్యేలా చేసింది. అలాంటి కమెడియన్‌ల జాబితాలో కమెడియన్‌ సుడిగాలి సుధీర్ ఒకరు. స్మాల్‌ స్క్రీన్‌పై అతని ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఓ పక్క కమెడియన్‌గానూ.. మరోపక్క టీవీ షోల్లో యాంకర్‌గా.. ఇక అప్పుడప్పుడు మూవీస్‌ చేస్తున్నాడు.

ఇక సుధీర్ కేరీర్ స్టార్టింగ్‌లో చిన్నా చితక మెజిషియన్‌ చేసుకుంటూ జబర్దస్త్‌ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్‌తో బుల్లితెరపై తన ఇమేజ్‌ని పెంచుకున్నాడు. ప్రస్తుతానికి పలు షోలతో బిజీబిజీ అయిపోయాడు. వీలైనప్పుడల్లా ఈ గ్యాప్‌లో మూవీస్ కూడా చేస్తున్నాడు.

Read Also: ఇద్దరమ్మాయిలతో రచ్చ చేయనున్న బన్నీ

ఇదిలా ఉంటే.. ప్రముఖ తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా ఓటీటీ సక్సెస్‌ పుల్‌గా మూడు సీజన్స్‌ని కంప్లీట్‌ చేసుకున్న సర్కార్ షోకి సుధీర్ యాంకరింగ్‌ చేయబోతున్నాడు. లేటెస్ట్‌గా ఈ విషయాన్ని ఆహా ప్రకటించింది. కొత్త సర్కార్ సుడిగాలి లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాడు. ఇక ఆట మొదలెడదామా అంటూ హైప్‌ ఇచ్చే అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది.

ఈ సర్కార్ షో 2021లో స్టార్ట్ అవ్వగా.. గత సీజన్‌లో లేడీ సూపర్‌స్టార్‌ సాయి పల్లవి, సిద్దు జొన్నలగడ్డ, రానా, విశ్వక్‌సేన్, శ్రీవిష్ణు, ప్రియమణి, సైనా నెహ్వాల్, కశ్యప్ లాంటి ప్రముఖ సెలబ్రెటీలు ఈ షోకి వచ్చి అదరగొట్టారు. మరి రాబోయే నాలుగో సీజన్‌లో భాగంగా వచ్చే స్టార్స్‌ ఎవరనేది మాత్రం ఆహా క్లారిటీ ఇవ్వలేదు.

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం