Chiranjeevi | అల్లు అరవింద్ కు కౌంటర్ ఇచ్చిన చిరంజీవి..!
chiranjeevi
Cinema, ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi | అల్లు అరవింద్ కు కౌంటర్ ఇచ్చిన చిరంజీవి..!

Chiranjeevi |  పుష్ప–2 వర్సెస్ గేమ్ ఛేంజర్ వార్ మామూలుగా జరగలేదు. కాకపోతే పుష్ప–2 భారీ హిట్ అయింది. గేమ్ ఛేంజర్ మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ టైమ్ లోనే అల్లు అరవింద్ చేసిన కామెంట్లు నిప్పులో పెట్రోల్ పోసినట్టు ఫ్యాన్ వార్ ను మరింత పెంచేసింది. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. దిల్ రాజు ఒక సినిమాను పడుకోబెట్టి.. మరో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు అంటూ నవ్వుతూ కామెంట్ చేశాడు. ఆయన అలా నవ్వుతూ మాట్లాడటాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ చేశారు నెటిజన్లు. గేమ్ ఛేంజర్ గురించే అరవింద్ అలా వెటకారంగా మాట్లాడాడు అంటూ కామెంట్లు వినిపించాయి.

దాని గురించి మరో ప్రెస్ మీట్ లో అడిగితే నో కామెంట్స్ అంటూ దాటవేశాడు అరవింద్. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఆయనకు కౌంటర్ విసిరారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి హీరో సినిమా ఆడాలని తాను కోరుకుంటానని చెప్పారు. తన ఫ్యామిలీలో ఉన్న హీరోలు తనకంటే పెద్ద స్థాయిలో ఉంటే అస్సలు అసూయపడనన్నారు. పుష్ప–2 పెద్ద హిట్ అయితే తాను చాలా సంతోషించానని చెప్పుకొచ్చారు. దాంతో అరవింద్ గేమ్ ఛేంజర్ ను తీసేసినట్టు మాట్లాడితే.. చిరంజీవి మాత్రం చాలా హుందాగా మాట్లాడారని.. ఇది అరవింద్ కు కౌంటర్ అటాక్ లాంటిదే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. మెగాస్టార్ వ్యక్తిత్వం ఇలాంటిది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

అల్లు అరవింద్ లాగా అసూయ పడే గుణం చిరంజీవికి లేదు అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అయితే దానికి అల్లు ఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తున్నారు. అల్లు అరవింద్ మగధీర సినిమాతో రామ్ చరణ్ కు పెద్ద హిట్ ఇచ్చారని.. ఆయన ఎప్పుడూ అసూయపడలేదంటున్నారు. గతంలో రామ్ చరణ్​ గురించి అరవింద్ ఏమేం చేశారో అవన్నీ ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు. మొత్తానికి అరవింద్, చిరు కామెంట్లతో మరోసారి ఫ్యాన్ వార్ పీక్స్ కు వెళ్లిపోయిందనే చెప్పుకోవాలి.

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..