Ashika Ranganadh Gets Another Crazy Offer: హీరో కల్యాణ్‌రామ్ నటించిన అమిగోస్ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయిన కన్నడ బ్యూటీ అషికా రంగనాధ్. ఆ తరువాత వచ్చిన నా సామిరంగ మూవీతో ఈ భామకి మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ విన్నా, తన పేరే వినిపిస్తోంది.
వరుసపెట్టి క్రేజీ ఆఫర్లతో బ్రేకుల్లేకుండా దూసుకుపోతూ బిజీ అవుతోంది. చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా సిద్ధార్థ్ సరసన మిస్ యు అనే మూవీలో యాక్ట్ చేయడానికి సైన్ చేసింది. ఇవే కాకుండా తాజాగా ఈ ముద్దుగుమ్మకి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. అదే సర్ధార్ 2 మూవీ. కార్తీ హీరోగా నటించిన ఈ సర్ధార్ మూవీ పెద్ద హిట్టయ్యింది.
Also Read: డబుల్ రోల్‌లో రౌడీ ఎంట్రీ
అందులో తండ్రికొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశాడు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రాబోతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది అషికా రంగనాథ్. ఫస్ట్ పార్ట్‌లో రాశిఖన్నా యాక్ట్ చేసింది.