Anasuya Bharadwaj Is Called Power Star In Power
Cinema

Actress Anasuya: పవర్‌లో పవర్ స్టార్ అంటున్న అనసూయ

Anasuya Bharadwaj Is Called Power Star In Power: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడమే గాక..ఈ ఎన్నికల్లో వంద శాతం రిజల్ట్‌తో జనసేన పార్టీకి మరపురాని విక్టరీ అందించారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. గెలవగానే ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలిసిన పవన్, ఆ తర్వాత నేరుగా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి చేరుకోగా, పవన్ కళ్యాణ్‌కి మెగా కుటుంబమంతా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.

రాంచరణ్ ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సహా కుటుంబమంతా కలిసి పవన్ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి ఎంజాయ్ చేశారు. ఇందులో పవన్ తల్లి అంజనాదేవి, భార్య అన్నాలెజినోవా, కొడుకు అకీరాలకు గుమ్మడికాయతో దిష్టి తీయగా, పవన్‌ వదినలు వారిని లోపలికి ఆహ్వానించారు. లోపలికి చేరుకున్న పవన్ కళ్యాణ్ తల్లి అజనాదేవితో పాటుగా అన్న చిరంజీవి, వదనల కాళ్లకు నమస్కారం చేశారు. ఆ వెంటనే చిరంజీవి తన తమ్ముడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ మొత్తం సీన్ మెగా లోకంలో అంతులేని ఆనందాన్ని నింపింది.

ఇక రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని అనసూయ, మెగా ఫ్యామిలీ రిలేషన్‌పై రియాక్ట్ అవుతూ క్రేజీ కామెంట్స్ చేసింది. మెగా ఫ్యామిలీ ఆప్యాయతలు చూసి ఇది నిజమైన ప్రేమ అని పేర్కొంది. చిరంజీవి, పవన్ మధ్య అనుబంధం గురించి ఆమె ఇలా రియాక్ట్ అయింది. ఇకపోతే పవర్‌లో పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్‌ని తెగ పొగిడేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, నాయకుడు వచ్చాడని పేర్కొంది. మెగా ఫ్యామిలీ సహా మెగా లోకంలో సంబరాలు మిన్నంటిన వేళ అనసూయ చేసిన ఈ కామెంట్స్ అందరిలో మరింత జోష్ నింపాయి. మెగా ఫ్యాన్స్ అంతా అనసూయ మాటలకు ఫిదా అయిపోతున్నారు. రీసెంట్‌గా జబర్దస్త్‌కి బై బై చెప్పిన అనసూయ, ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2లో నటిస్తోంది.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?