Anasuya Bharadwaj Fight With Sekhar Master In Maa Tv Show:తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర, వెండితెర ఆడియెన్స్‌కు అస్సలు పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. ఈ భామ తనదైన రీతిలో సుదీర్ఘకాలంగా తన హవాను కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ మధ్యకాలంలో సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోన్న స్టార్ లేడీ అనసూయ భరద్వాజ్.
ఇప్పుడు బుల్లితెరపైకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ షోలో అనసూయ భరద్వాజ్ బట్టలు విప్పేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలేం జరిగిందంటే తెలుగులో స్టార్ యాంకర్ జబర్ధస్త్ షోతో అనసూయ భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చి అందం, యాంకరింగ్‌తో మంచి గుర్తింపును అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం అనసూయ టెలివిజన్‌లో పెద్దగా కనిపించడం లేదు.
కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో స్టార్ మాలో ఓ గేమ్ షో జూన్ 29 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ షోను శ్రీముఖి హోస్ట్ చేయనుంది. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు రెండు టీమ్‌లుగా ఏర్పడి పోటీ పడబోతున్నారు. ఇందులో ఖిలాడీ గర్ల్స్ టీమ్‌కు అనసూయ, కిర్రాక్స్ బాయ్స్‌కు శేఖర్ మాస్టర్ మెంటర్లుగా ఉన్నారు. ఈ షోలో డ్రెస్ విప్పి అందరికి షాక్ ఇచ్చింది అనసూయ. హై రేంజ్‌లో ప్రారంభం కాబోతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్‌తో పోటీకి దిగి అనసూయ డ్రెస్ విప్పేసింది.దీంతో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్‌గా మారింది.