Allari Naresh New Movie First Look: టాలీవుడ్‌లో అల్లరి మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో నరేశ్. తన ఫస్ట్ మూవీతో ఆడియెన్స్‌ని ఎంతగానో అలరించాడు. దాంతో అదే మూవీ టైటిల్ పేరును తన పేరులో చేర్చుకొని అల్లరి నరేశ్‌గా మారాడు. ఈవీవీ దర్శకత్వంలో కితకితలు, తొట్టిగ్యాంగ్ వంటి మూవీస్‌తో కామెడీ హీరోగా టాలీవుడ్‌ని షేక్ చేశాడు. అనంతరం కామెడీ మూవీస్‌తో పాటుగా, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు చేస్తూ కామెడీ మూవీస్‌తోనే కాదు, అన్నిరోల్స్‌లోనూ వావ్ అనిపించుకుంటున్నాడు.
ఇక తాను హీరోగా యాక్ట్ చేసిన తాజా మూవీ బచ్చల మల్లి. ఈ మూవీకి సంబంధించి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. నరేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నరేశ్ నాటు లుక్‌లో అదరగొట్టారు. ఈనెల 30న టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ మూవీకి సుబ్బు మంగదెవ్వి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాదిలో అల్లరి నరేశ్ యాక్ట్ చేసిన రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. హీరో నాగార్జున యాక్ట్ చేసిన మూవీ నా సామిరంగలో అల్లరి నరేశ్ కీరోల్ పోషించారు.
Also Read: భారతీయుడి మూవీ కామెంట్స్‌పై డైరెక్టర్ క్లారిటీ
ఇందులో అల్లరి నరేశ్ యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఆ ఒక్కటీ అడక్కు అంటూ నరేశ్ హీరోగా వచ్చిన మూవీ పర్వాలేదనిపించింది. ఈ చిత్రాల తర్వాత పక్కా మాస్ రోల్‌తో సుబ్బు మంగదెవ్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బచ్చల మల్లి మూవీపై ఫ్యాన్స్‌కి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.