Actress Samantha Post On Hero Naga Chaitanya Goes Viral
Cinema

Actress Samantha: నటి సమంత పోస్ట్ వైరల్, నాగ చైతన్యకేనా..

Actress Samantha Post On Hero Naga Chaitanya Goes Viral:టాలీవుడ్‌లో రిలీజైన లవ్‌ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ ఏమాయ చేశావే. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్‌ అయిన నటి సమంత. సమంత ఈ మూవీలో యాక్ట్ చేసి టాలీవుడ్‌ ఆడియెన్స్‌ని మాయ చేసింది. తన గ్లామర్‌, యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక హీరో నాగచైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత విడాకులిచ్చేసింది. మయోసైటిస్ రావడంతో చికిత్స తీసుకునేందుకు ఒక ఏడాది మూవీస్‌కి బ్రేక్‌ ఇచ్చింది. ప్రస్తుతం స్టోరీలను వింటోంది. అట్లీ బన్నీ కాంబోలో రాబోతున్న మూవీలో హీరోయిన్‌గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి.

కానీ దీనిపై అధికారికంగా అనౌన్స్‌మెంట్‌ చేయలేదు. గెలవాలని కోరుకుంటున్నా ఏడాది నుంచి సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నప్పటికీ ఇటీవలే నిర్వహించిన సర్వేలో తెలుగులో నెంబర్‌వన్ హీరోయిన్‌గా నిలిచింది. సోషల్‌మీడియాల్లో మాత్రం ఎంతో ఆక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ, ఫొటోలను అప్‌డేట్ చేస్తుంటుంది. తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. నేను మీరు గెలుస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆమె తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. నీ హృదయం ఏది కోరుకున్నా, మీ ఆకాంక్షలు ఏమైనా, నేను మీ కోసం నిలబడతాను. మీరు గెలవడానికి అర్హులని రాసుకొచ్చింది.

Also Read: కన్నప్ప టీజర్‌కి డేట్‌ ఫిక్స్‌

సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టి ఉంటుందని నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది. తండేల్ మూవీ కోసం నాగచైతన్య తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజు అనే మత్స్యకారుడి జీవిత చరిత్రతో ఈ మూవీ రానుంది. పాన్‌ఇండియా స్థాయిలో రిలీజ్ అవబోతున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. నటి సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఘనవిజయం సాధించాలని సమంత కోరుకుంటోందని, అందుకే ఈ పోస్టు పెట్టిందని నెట్టింట చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలని కోరుకుంటోందంటున్నారు. మరి ఎవరిని ఉద్ద్యేశించి ఈ వ్యాఖ్యలు చేసిందనేది తెలియాలంటే సమంత రియాక్ట్ అయ్యేంతవరకు వెయిట్‌ చేయకతప్పదు.

 

View this post on Instagram

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు