Actress Samantha Green Signal Given To Siddhu Jonnalagadda
Cinema

Actress Samantha: ఆ హీరోతో సమంత రొమాన్స్

Actress Samantha Green Signal Given To Siddhu Jonnalagadda: ఈ మధ్యకాలంలో నటి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఏమాయ చేశావే మూవీతో టాలీవుడ్ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయిన సమంత.. మహేష్ బాబు హీరోగా చేసిన దూకుడు మూవీతో స్టార్ హీరోయిన్ హోదాని సంపాదించింది. ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ..హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.

ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించలేదు. ఇటీవలే తిరిగి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌తో పాటు, తెలుగులో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోంది. తాజాగా సమంతో మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జోన్నలగడ్డతో రొమాన్స్ చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేస్తున్నారు . నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్న సరే రిజెక్ట్ చేసి సిద్దు జొన్నలగడ్డ మూవీకి ఓకే చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. డెస్టిని అంటే ఇదేనేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!