Actress Nivetha Thomas Post Goes Viral On Social Media: సొట్టబుగ్గల మలయాళ బ్యూటీ నివేతా థామస్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ భామ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి జెంటిల్‌మెన్, నిన్నుకోరి, బ్రోచేవారేవురా, పవన్ కళ్యాణ్ బ్రో వంటి మూవీస్‌తో మంచి ఐడెంటీటీని తెచ్చుకుంది. ఇక అప్పుడెప్పుడో శాకిని డాకిని అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చింది ఈ భామ. అనంతరం ఏ మూవీని ఒప్పుకోలేదు. అయితే నివేతా పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
నివేతా థామస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా దూరంగా ఉంటుంది ఈ భామ, గతంలో లాగా ప్రతీది పోస్ట్ చేసే ఈ భామ కొన్ని రోజులు అసలే కనిపించకుండా పోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఈమె చాలా రోజులకు పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది. చాలా కాలం గడిచింది… కానీ.. చివరిగా అంటూ లవ్ ఎమోజీని జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు నివేతా పెళ్లి చేసుకోబోతుందంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ న్యూస్‌పై నివేతా క్లారిటీ ఇచ్చే దాక అసలు మ్యాటర్ ఏంటనేది తెలియాల్సి ఉంది.