Actress Nivetha Pethuraj Latest WebSeries Paruvu Trailer Out Now
Cinema

OTT Thriller Movie: థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్ డేట్‌

Actress Nivetha Pethuraj Latest WebSeries Paruvu Trailer Out Now: ఓటీటీ, వెబ్ సిరీస్‌లు ఎక్కడ చూసిన సరే దాదాపుగా థ్రిల్లర్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు అదే జానర్‌లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ పరువు. రీసెంట్‌గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది చూశారా.. అది ఈ సిరీస్ కోసమే రికార్డు చేశారు. ఇ‍ప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు.

హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య మెయిన్ రోల్‌లో యాక్ట్ చేసిన సిరీస్ పరువు. ఈ మూవీలో నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్‌గా చేసింది. ఇక ఈ మూవీని సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ బాణీలను అందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

Also Read: బిగ్ ట్విస్ట్‌, మరింత పుష్ప 2 క్లైమాక్స్‌..?

కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తుంటారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఈ సస్పెన్స్ సిరీస్‌లో మరిన్ని కీలక అప్‌డేట్స్ తెలియాలంటే ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ అయ్యేంతవరకు వెయిట్ చేయకతప్పదు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు