Actress Namitha Poses As Goddess Fans Expect Second Innings: పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో బిజీ అవుతూ చాలామంది హీరోయిన్స్ మూవీ ఇండస్ట్రీకి కంప్లీట్‌గా దూరమయ్యారు. అలాంటి ఎందరో నటీమణులు చాలా గ్యాప్ అనంతరం మళ్లీ తమ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో నటి నమిత కూడా ఒకరు. సౌత్‌లో తనకంటూ నటిగా ఓ ఐడెంటీటీని సంపాదించుకుంది.
కానీ తను యాక్ట్ చేసిన మూవీస్ ఫ్లాప్ అవ్వడం, అదే టైమ్‌లో పెళ్లి జరగడంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. తాజాగా తనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో తను అమ్మవారి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన వారంతా నమిత కూడా సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యిందని అనుకుంటున్నారు. తను అమ్మవారి గెటప్‌లో ఉన్న వీడియోను నమిత షేర్ చేసింది. దీంతో తన ఫ్యాన్స్ ఈ లుక్‌ను ప్రశంసిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తమిళంలో అమ్మవారి లుక్‌లో చాలా మంది నటించారు.
Also Read: మెగా బర్త్‌డే, ప్రముఖుల విషెస్
కానీ ఈ లుక్‌లో ఆమె సరిగ్గా సరిపోయిందని కొందరు. అందరికంటే నమితకే ఇది బాగా సెట్ అయ్యిందని మరికొందరు. తనను త్వరలోనే వెండితెరపై అమ్మవారి పాత్రలో చూడాలని కోరుకుంటున్నట్లు చాలామంది నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇక ఈ వీడియోని నమిత టీమ్‌లోని ఒక అమ్మాయి పోస్ట్ చేయగా నమిత దీనిని షేర్ చేసింది. ఇక ఇది చూసి చాలామంది ఆడియెన్స్, ఆమె ఫ్యాన్స్ సినిమా షూటింగ్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ కొన్నిరోజుల క్రితమే అసలు ఈ గెటప్ తాను ఎందుకు వేసుకున్నారో మరో వీడియోలో క్లారిటీ ఇచ్చింది నమిత.